బెట్టింగ్‌లో శిల్పాశెట్టి పాత్ర?: ద్రావిడ్‌ను ప్రశ్నించే అవకాశం

Shilpa Shetty and Rahul Dravid
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమాని శిల్పా శెట్టి, జట్టు సారథి రాహుల్ ద్రావిడ్‌ను పోలీసులు ప్రశ్నించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. తాను బెట్టింగ్స్‌కు పాల్పడినట్లు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోలీసుల ఎదుట వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో శిల్పా శెట్టిని, రాహుల్ ద్రావిడ్‌ను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరోవైపు కొందరు బుకీలు పోలీసుల ఎదుట శిల్పా శెట్టి పేరు చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో బెట్టింగులో ఆమె పాత్రపై పోలీసులు విచారించనున్నారని సమాచారం.

కుంద్రా అరెస్టుకు రంగం సిద్ధం

తాను బెట్టింగ్స్‌కు పాల్పడినట్లు రాజ్ కుంద్రా పోలీసుల ఎదుట అంగీకరించడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. బెట్టింగుకు పాల్పడినట్లుగా రాజ్ కుంద్రా విచారణలో అంగీకరించారని ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు.

ఆయన మీద అనుమానం వచ్చే తాము విచారణకు పిలిచామని, బెట్టింగుకు పాల్పడినట్లు ఆయన అంగీకరించారని ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ చెప్పారు. తన వ్యాపార భాగస్వామి ఉమేష్ గోయెంకా ద్వారా బెట్టింగు చేసిన కుంద్రా పెద్ద ఎత్తున నష్టపోయినట్లు పోలీసులు చెప్పారు.

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై అనుమానాలు

రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్స్‌కు పాల్పడినట్లు అంగీకరించడం, బెట్టింగ్స్‌లో శిల్పా శెట్టి పాత్ర పైన అనుమానాలు తలెత్తడంతో జట్టు ఫ్రాంచైజీపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+