విభేదాలు: కెసిఆర్ సభలో తెరాస నేత ఆత్మహత్య

మంథని పట్టణంలో తెలంగాణ అంశానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా నాగరాజు ముందుండి పనిచేసేవాడు. కెసిఆర్ ఆమరణనిరాహార దీక్ష చేసినప్పుడు మంథని పోలీసు స్టేషన్ సిబ్బంది క్వార్టర్స్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. 2009 డిసెంబంర్ 8న కెసిఆర్ పరిస్థితి విషమించిందని టివిలో వచ్చిన వార్తకు కలత చెందిన నాగరాజు మరోసారి మంథని టెలిఫోన్ ఎక్చేంజి ఆవరణలో ఉన్న టవర్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. సకల జనుల సమ్మె సందర్భంగా మంథని, కాటారం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దాదాపు 20కేసుల వరకు నాగరాజుపై ఉన్నాయి.
తెరాస జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నాగరాజు ఇటీవల రాంరెడ్డి, సునీల్ రెడ్డిల చేరిక తర్వాత నుంచి పార్టీలో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దృష్టికి పలుమార్లు పార్టీలో జరుగుతున్న విషయాలను తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయంది. ఓసారి కెసిఆర్ మంథనికి రావడంతో ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా కొంతమంది వేదికపైకి ఎక్కకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. ఈ అవమానాలన్నీ భరిస్తూ వచ్చిన నాగరాజు వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగి జై తెలంగాణ నినాదాలు చేస్తూ సభా ప్రాంగణంలో తిరిగాడు.
అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో హుటాహుటిన మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరీ విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పెద్దపల్లి ఎంపీవివేక్, తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, కరీంనగర్ ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్‌లు ఆసుపత్రికి వెళ్లి నాగరాజు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పార్టీలో విభేదాల కారణంగా నాగరాజు ఆత్మహత్యకు పాల్పడటంతో మంథనిలోని రాంరెడ్డి నివాసం వద్ద తెలంగాణ వాదులు రాత్రి ఆందోళనకు దిగారు. రాంరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వ్యాపార సంస్థలన్నీ మూసివేసి నాగరాజు మృతికి నివాళులర్పించారు. శుక్రవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications