శిల్పా భర్త కుంద్రా: కండక్టర్ కొడుకు స్టేజ్‌నుండి(పిక్చర్స్)

ముంబై: రాజ్ కుంద్రా... ఇప్పుడు ఈ పేరు పతాక శీర్షికలకెక్కింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమాని అయిన ఇతను నటి శిల్పా శెట్టి భర్త. ఇతను మధ్య తరగతి కుటుంబం నుండి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు. కుంద్రాది పంజాబ్ రాష్ట్రం. ఆయన తండ్రి బస్ కండక్టర్‌గా పని చేశారు. అతను లండన్‌లో పని చేశారు. ఆ తర్వాత చిన్న వ్యాపారవేత్తగా మారారు. కుంద్రా తల్లి దుకాణంలో సహాయకురాలిగా పని చేసేవారు.

రాజ్ కుంద్రా కనీసం ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేదు. అతను 1990లలో కొంతకాలం నేపాల్‌లో ఉండి ఆ తర్వాత తిరిగి యుకె వెళ్లిపోయారు. అక్కడ పాశిమానా షాలువాల బిజినెస్ చేశారు. ప్రస్తుతం రాజ్ కుంద్రా గ్రూప్‌కో డెవలపర్స్‌తో కలిసి పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ సంస్థ. ఇది భారత్‌లోని ఎనిమిది ప్రధాన నగరాల్లో పని చేస్తోంది. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు.

మరికొన్నింటితో కలిసి కూడా పని చేస్తున్నారట. పలు వ్యాపారకలాపాలు సాగిస్తున్న కుంద్రా బిగ్ టైకూన్ అని చెప్పవచ్చు. రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని అయిన రాజ్ కుంద్రాకు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో ప్రాపర్టీ, లండన్‌, ముంబైలలో బంగ్లాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ముంబైలో కుంద్రా మూడేళ్లుగా నివసిస్తున్న భవంతి సముద్రానికి ఎదురుగా, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటికి సమీపంలో ఉంది.

రాజ్ కుంద్రా, బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్ మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. దారా సింగ్ చనిపోయినప్పుడు విందూ ఇంటికి కుంద్రా వచ్చారు. సాక్షి సింగ్, ధోనీ కూడా స్నేహితులే. రాజ్ కుంద్రా తన మొదటి భార్య కవితకు విడాకులు ఇచ్చాక బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నారు. కవిత తన పిల్లలతో లండన్‌లో ఉంటున్నారు. విడాకుల కండిషన్‌లో కవిత మీడియాతో మాట్లాడకుండా ఉండాలనే నిబంధన కూడా ఉందని తెలుస్తోంది.

శిల్పాశెట్టితో..

ఓ మ్యాచ్ సందర్భంగా నటి, భార్య శిల్పాశెట్టితో రాజ్ కుంద్రా

సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్

శిల్పా, రాజ్ కుంద్రా హాజరైన ఎస్ఎఫ్ఎల్ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ ప్రచార కార్యక్రమంలో...

ఓ కార్యక్రమంలో..

ఓ కార్యక్రమానికి హాజరైన శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా

కుంద్రాను అడ్డుకుంటూ శిల్పా

సెల్ఫ్ డిఫెన్స్ ప్రచారం కార్యక్రమంలో భాగంగా కుంద్రాను ఎదుర్కొంటున్న శిల్పా శెట్టి

ముద్దుల తనయుడు

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా తనయుడు వియాన్ రాజ్ కుంద్రా. వియాన్ రాజ్ కుంద్రా 21 మే 2012లో జన్మించాడు.

తల్లితో వియాన్

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో తల్లి శిల్పాశెట్టితో తనయుడు వియాన్ రాజ్ కుంద్రా

తల్లి ఫోన్‌తో ఆడుతున్న వియాన్

రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి మ్యాచ్ చూస్తున్న సమయంలో తల్లి ఫోన్‌తో ఆడుకుంటున్న వియాన్

తనయుడిని తీసుకెళ్తూ..

తనయుడు వియాన్‌ను జోద్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీసుకు వెళ్తూ శిల్పా, రాజ్ కుంద్రా

మాజీ అండ్ ప్రజెంట్

భార్య శిల్పా శెట్టితో రాజ్ కుంద్రా... పక్కన మాజీ భార్య కవిత

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+