స్టుపిడ్: శిల్పా భర్త కుంద్రాపై లేలే, షాక్‌కు గురైన జగ్దాలే

Raj Kundra
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్స్‌కు పాల్పడ్డారనే విషయం తెలియడంతో బిసిసిఐ మాజీ సెక్రటరీ సంజయ్ జగ్దాలే షాక్‌కు గురయ్యారు. కుంద్రా బెట్టింగ్స్‌లో ఉన్నాడని తెలిసి తాను షాక్‌కు గురయ్యానని జగ్దాలె చెప్పారు. ఇది అభిమానుల నమ్మకానికి సంబంధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ జట్టు యజమానిగా ఉంటూ బెట్టింగ్స్‌కు పాల్పడటం నైతికమైన చర్య కాదన్నారు. బెట్టింగ్స్‌కు పాల్పడటమే తప్పన్నారు. ఇలాంటి విషయాలు క్రికెట్‌కు అంత మంచివి కావన్నారు. కుంద్రా విషయాన్ని బిసిసిఐ చూసుకుంటుందని చెప్పారు. ఇది బిసిసిఐకి ఓ పాఠం అన్నారు. బిసిసిఐ అధికారులు కూర్చొని క్రికెట్‌ను క్లీన్ చేయాలని సూచించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

మరోవైపు బిసిసిఐ మాజీ సెక్రటరీ జయవాంత్ లేలే... కుంద్రా తీరుపై మండిపడుతూ స్టుపిడ్ అన్నారు. బెట్టింగ్స్‌లో కుంద్రా ఉండటం ఓ స్టుపిడ్ అన్నారు. ప్రస్తుతం క్రికెట్‌లో జరుగుతున్న అంశాలతో తాను సంతోషంగా లేనని, ఆవేదనకు గురి చేస్తోందని లేలే ఈ సందర్భంగా చెప్పారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమానిగా ఉండి కూడా అయన బెట్టింగ్స్‌కు పాల్పడటం శోచనీయమన్నారు. ఇది ఆయన స్టుపిడ్ తనానికి నిదర్శనమన్నారు. తాను అతని పట్ల జాలిపడుతున్నానన్నారు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొందరు బెట్టింగ్స్‌కు పాల్పడటం బాధాకరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+