తప్పు తేలితే కుంద్రాను తప్పిస్తాం: రాజస్థాన్ రాయల్స్

తప్పు చేసినట్లు తేలితే రాజ్ కుంద్రాను సస్పెండ్ చేస్తామని, వాటాను వెనక్కి తీసుకోవాలని సూచిస్తామని వివరించింది. కుంద్రా బెట్టింగు ఆరోపణలు ఎదుర్కున్నట్లు తెలిసిందే. రాజ్ కుంద్రా రాజస్థాన్ రాయల్స్‌పైనే బెట్టింగులు కట్టినట్లు, ఈ విషయాన్ని కుంద్రా అంగీకరించినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ చెప్పిన విషయం కూడా తెలిసిందే.
తన తరఫున వాదించడానికి రాజ్ కుంద్రా ప్రముఖ న్యాయవాది మజీద్ మెమొన్‌ను నియమించుకున్నారు. తన తరఫున ప్రకటనలన్నీ మజీద్ తరఫున విడుదలవుతాయని, త్వరలో వాస్తవం బయటపడుతుందని రాజ్ కుంద్రా ట్వీట్ చేశాడు.
బ్రిటిష్ జాతీయుడైన రాజ్ కుంద్రాను పోలీసులు బుధవారం 11 గంటల పాటు ప్రశ్నించారు. కుంద్రా వ్యాపార భాగస్వామి ఉమేష్ గోయంకా జట్టు కూర్పు, పిచ్ సమాచారం అడుగుతుండేవాడని రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సిద్ధార్థ్ త్రివేది పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు కుంద్రాను ప్రశ్నించారు. రాజ్ కుంద్రాకు బెట్టింగుతో తప్ప స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధం లేదని పోలీసులు చెప్పారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications