చెల్లెలి కూతురిని బావిలో పడేసి చంపేసిన అక్క

Warangal
వరంగల్: వరగంల్ జిల్లాలో అమానుష చర్య చోటు చేసుకుంది. ఓ మహిళ తన చెల్లెలి కూతురిని అమానుషంగా చంపేసింది. అక్కాచెల్లెళ్ల మధ్య గొదవ చిన్నారి ప్రాణానికి ఎసరు పెట్టింది. వరంగల్ జిల్లా మంగపేట మండలం రమణక్కపేట గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చదలవాడ రాజేశ్వరి అనే మహిళ తన చెల్లెలు ధనలక్ష్మి కూతురును బావిలో వేసి చంపింది.

ధనలక్ష్మి ఆస్తి కోసం ఆశపడి రాజేశ్వరి ఆ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ఒక్కగానొక్క కూతురు పోతే చెల్లెలి ఆస్తి తనకు వస్తుందని ఆశపడి రాజేశ్వరి ఏడాది వయస్సున్న చిన్నారిని పొట్టన పెట్టుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెక్ డ్యాంలో పడి ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని రాజుపాలెంలో చెక్‌ డ్యాంలో పడి ఇద్దరు విద్యార్థులు మరణించారు. సైకిల్ కడిగేందుకు వారు చెక్ డ్యాంలోకి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. కృష్ణ చైతన్య (14), పృథ్వీలుగా వారిని గుర్తించారు. పోలీసులు మృతదేహాలను వెలికి తీసి, కేసును దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసు కస్టడీలో వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం పోలీసు స్టేషన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కృష్ణా జిల్లా జి.కొండూరుకు చెందిన మారీష్ రావును ఓ దొంగతనం కేసులో విచారణ నిమిత్తం పోలీసులు స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే, ఫిట్స్ వచ్చి అతను మరణించినట్లు పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే, పోలీసులు విపరీతంగా కొట్టడం వల్లనే మరణించాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+