బర్త్ డే గిఫ్ట్: శిల్పా శెట్టికి రాజ్ కుంద్రా క్షమాపణలు

"నా ప్రియమైన భార్య శిల్పా శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు. నీపై వస్తున్న ఆరోపణలపై క్షమాపణలు చెబుతున్నా. వాస్తవం త్వరలోనే బయటపడుతుంది" అని ఆయన ఐపియల్ బెట్టింగ్ ఆరోపణలను ఉద్దేశించి అన్నారు. ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఆందోళనకు గురైన స్థితి వచ్చినందుకు క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు క్రికెట్ అజింక్యా రహనే కూడా శిల్పా శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తాను నిర్దోషినని కుంద్రా శుక్రవారం ఓ ప్రకటనలో చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ వాటాదారుడిగా ఢిల్లీ పోలీసు దర్యాప్తు బృందానికి తనను విచారించే హక్కు ఉందని, చట్టానికి కట్టుబడే పౌరుడిగా తాను విచారణకు హాజరయ్యానని, పోలీసులు వేసిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చానని, విచారణ తర్వాత వెళ్లిపోవడానికి తనను అనుమతించారని ఆయన వివరించారు.
కుంద్రాకు బెట్టింగుతో సంబంధం ఉన్నప్పటికీ స్పాట్ ఫిక్సింగ్‌తో మాత్రం సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కుంద్రాను మరోసారి విచారణకు పిలుస్తామని కూడా పోలీసులు అంటున్నారు. కుంద్రా సహ యజమానిగా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ అరెస్టయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications