గన్ కల్చర్: ఆరుగురిని కాల్చి చంపిన ఉన్మాది

రెండో వ్యక్తికి హింసాత్మక సంఘటనతో సంబంధం ఉందని శాంటా మోనికా పోలీసు చీఫ్ జాక్విలిన్ సీబ్రూక్స్ అన్నారు. రాజకీయ విరాళాల సేకరణ జరపడానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వస్తున్న ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో కాల్పులు జరిగిన ప్రదేశం ఉంది. కాల్పులు జరిపిన ఆగంతకుడి వివరాలు తెలియాల్సి ఉందని అంటున్నారు.
ఏ విధమైన అంతరాయం లేకుండా ఒబామా తన కార్యక్రమాన్ని ముగించుకున్నారు. కాల్పులు స్థానిక పోలీసుల వ్యవహారమని సీక్రెట్ సర్వీస్ అంది. మధ్యాహ్నానికి ముందు సాంటా మోనికాలో ఆ ఘటన చోటు చేసుకుంది.
ఆగంతకుడి కాల్పుల్లో మరణించిన ఇద్దరి మృతదేహాలు సంఘటనా స్థలంలో పడి ఉన్నాయి. మరో నాలుగు శవాలు బర్నింగ్ హోమ్‌కు, లైబ్రరీకి మధ్య వేరే చోట్ల కనిపించాయి. ముగ్గురు మహిళలకు గాయలయ్యాయి. బర్నింగ్ హోమ్ బయట కారులో ఉన్న మహిళకు గాయాలయ్యాయి. సంఘటనలో ఆగంతకుడితో పాటు మొత్తం ఏడుగురు మరణించారు.












Click it and Unblock the Notifications