భలే ప్రేమికుడు: అతనికి 14 మందితో 22 మంది పిల్లలు

అతను ఇప్పటికి 14 మంది మహిళలతో సంబంధం పెట్టుకుని కన్న 22 మంది పిల్లలను పోషించడానికి నెలకు 7 వేల డాలర్ల దాకా ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ బాధ పడలేక 'చైల్డ్ సపోర్ట్ సర్వీసెస్' అధికారులు ఓర్లాండో బిడ్డలకు జన్మనిచ్చిన తల్లుల తరఫున పోషణ కోరుతూ నాష్‌విల్లే కోర్టును ఆశ్రయించారు.
ఈ పిల్లలందరినీ పోషించాలంటే ఓర్లాండో కనీసం నాలుగు ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేయాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ స్కాట్ రోసెన్‌బర్గ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసు విచారణ పూర్తయితే ఓర్లాండోకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే అతనికి జైలు శిక్ష అసలు కొత్తే కాదు. అతడికి చాలా పెద్ద క్రైం రికార్డే ఉంది.
ఈ కేసు సంగతి ఎలా ఉన్నా ఓర్లాండో మాత్రం కోర్టు హాల్ నుంచి బయటికొచ్చి - "నేను యువకుణ్ని, ఒక లక్ష్యం కలవాణ్ని. నేను మహిళల్ని ప్రేమిస్తాను'' అంటూ ఓ టీవీ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అమ్మాయిల లెక్క తనకు గుర్తు లేదని.. 18 మందితో 17 మందిని కని ఉంటానని, అయినా పిల్లల లెక్కతో తనకు సంబంధం లేదని, తన పిల్లలందరినీ ప్రేమిస్తానని, వాళ్లంతా తన 'షా' ఇంటిపేరును తరాల తరబడి నిలబెడతారని పరమానందంగా చెప్పాడు.
తనకు 50 మంది పిల్లలను కనాలని ఉందని, ఇప్పటికే పుట్టినవారి పోషణ కేసుల్ని భరించలేక ఇక వేసెక్టమీ చేయించుకోవాలనుకుంటున్నానని చెప్పి చైల్డ్ సపోర్ట్ అధికారులకు చెప్పాడు. తన క్రిమినల్ రికార్డు వల్ల తనకు ఉపాధి లభించడం లేదని, ఉద్యోగం కోసం ప్రతీ ప్రయత్నం చేస్తున్నానని అంటూ అతం రికార్డు వల్ల తనకు ఎక్కడు ఉద్యోగం లభిస్తుందని అడిగాడు.












Click it and Unblock the Notifications