ఒబామాకు విషం పూత లేఖ: వర్దమాన నటి అరెస్టు

నేరం రుజువైతే ఆమెకు పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. టాక్సిన్ రిసిన్ పూసిన మూడు లేఖలను షానోన్ పంపినట్లు అరెస్టు అఫిడవిట్‌లో తెలిపారు. లేఖలు ఒబామాకు, బ్లామ్‌బెర్గ్‌కు రిచర్జ్సన్ పంపినట్లు ఆరోపిస్తున్నారు. టెలివిజన్ సీరియళ్లలో ఆమె చిన్నపాటి పాత్రలు పోషించింది. ఆమెను న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.
తన భర్త ఆ లేఖలు పంపి ఉంటాడని చెప్పడంతో రిచర్డ్సన్‌పై అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దృష్టి పడింది. తన భర్తను ఇరికించడానికి రిచర్డ్సన్ స్వయంగా ఆ లేఖను మెయిల్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. హోం కంప్యూటర్‌ను పరీక్షించగా రిసిన్ ఆనవాళ్లు కనిపించాయని అంటున్నారు.
మిసిసిపికి చెందిన ఓ వ్యక్తి కూడా విషం పూసిన లేస్‌డే రిసిన్‌ను ఒబామాకు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. నేరం రుజువైతే ఆ వ్యక్తి జేమ్స్ ఎవరెట్ దచస్కీకి జీవిత ఖైదు పడుతుంది. అతన్ని ఏప్రిల్ 27వ తేదీన అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications