కాటేయబోయాడని మామ చేతులు నరికారు

తమపై వరుసగా లైంగిక దోపిడీకి ప్రయత్నాలు సాగించడంతో రాధేశ్యం సింగ్‌పై తాము విసిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. కూరగాయలు తరుగుతున్న ఓ కోడలిపై మూడు రోజుల క్రితం అతను లైంగిక దాడికి ప్రయత్నించాడని, ఆమె అరవడంతో రెండో కోడలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిందని పోలీసులు చెబుతున్నారు.
వెనక్కి తగ్గాలని చెప్పిన రెండో కోడలిపై కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో వారిద్దరు అతన్ని పట్టుకుని పదునైన ఆయుధంతో రెండు చేతులు కూడా నరికేశారు. రోహతస్‌లో అతనికి ప్రాథమికంగా చికిత్స అందించారు. ఆ తర్వాత అతన్ని వారణాసి ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు కోడళ్ల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications