ఆధారాల్ని బట్టి అరెస్ట్, విమర్శలు సహజమే: జెడి రిలీవ్

తమపై రాజకీయంగా వచ్చిన ఆరోపణలను కోర్టు ద్వారానే సమాధానం చెప్పానని అన్నారు. మీడియాతో మాట్లాడారనే ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. సమాచార సేకరణలో భాగంగానే తాము మీడియాతో మాట్లాడినట్లు చెప్పారు. మీడియాతో మాట్లాడటం వల్ల కొంత సమాచారం సేకరించినట్లు చెప్పారు.
అవినీతికి పాల్పడే వారు, ప్రోత్సహించే వారి వల్ల అభివృద్ధికుంటుపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దర్యాఫ్తు చేస్తున్న మూడు కేసులకు సంబంధించి వేర్వేరు కోణాల్లో దర్యాఫ్తును చేసి వేర్వేరు ఛార్జీషీట్లను తాము కోర్టులో దాఖలు చేశామని చెప్పారు. సొంత రాష్ట్రంలో పని చేయడం గర్వంగా ఉందన్నారు. విచారణలో ఎలాంటి పొరపాట్లు చేయలేదని, పక్షపాతం చూపించలేదన్నారు.
సిబిఐ పంజరంలో చిలుక వ్యాఖ్యలపై తాను స్పందించనని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించానన్నారు. విచారణలో ఎలాంటి పొరపాట్లు చేయలేదని, పక్షపాతం చూపలేదన్నారు. విమర్శలు సహజమేనన్నారు. సిబ్బంది కొరత ఎక్కువగా ఉందన్నారు. ఆధారాలను బట్టే అరెస్టులు జరిగాయమని, రిటైర్మెంట్ తర్వాత తాను గురుకుల పాఠశాలను స్థాపిస్తానన్నారు.
కాగా లక్ష్మీ నారాయణ ఈ రోజు రిలీవ్ అయ్యారు. డిఐజి వెంకటేష్‌కు ఆయన బాధ్యతలు అప్పగించారు. జెడి లక్ష్మీ నారాయణను కేంద్రం ఈనెల 7వ తేదీన బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన మంగళవారం నాడు రిలీవ్ కావాలని ఢిల్లీ సి.బి.ఐ. ప్రధాన కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపిఎస్ అధికారి అయిన లక్ష్మీ నారాయణ తిరిగి మాతృ సంస్థకు వెళుతున్నారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications