'నాగం వెళ్లి, అద్వానీని పంపించారు': అమర్‌సింగ్ మద్దతు

Nagam janardhan reddy and Amar Singh
హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీ లాబీల్లో మంగళవారం భారతీయ జనతా పార్టీకి చెందిన నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వర రావు, అశోక గజపతి రాజుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. తుమ్మల, అశోకలు ఎదురైనప్పుడు నాగం వారితో.. తనను టిడిపి నుండి సస్పెండ్ చేసి బయటకు గెంటివేశారని ఆయన అన్నారు.

దానికి వారు స్పందించారు. నాగం జనార్ధన్ వంటి నేతలను తాము బయటకు పంపివేయగలమా? అని ప్రశ్నించారు. నాగం బిజెపిలో చేరి అద్వానీనే బయటకు పంపించారు.. అలాంటి వ్యక్తిని ఎవరైనా టిడిపి నుండి బయటకు పంపగలరా? అని చమత్కరించారు. దీంతో వారి మధ్య కాసేపు నవ్వులు విరబూశాయి. కాగా రెండుసార్లు వాయిదా పడిన అసెంబ్లీ తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల ఆందోళనలతో మళ్లీ కాసేపటికే బుధవారానికి వాయిదా పడింది.

అద్వానీకి అమర్, జశ్వంత్‌ల మద్దతు

బిజెపిలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన ఆ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి అమర్ సింగ్ మద్దతు పలికారు. అద్వానీ సీనియర్ నేత అని, అలాంటి వ్యక్తిని వేధించడం సరికాదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని అద్వానీయే రక్షించిన ఉదంతాన్ని ఎవరూ మరువకూడదన్నారు.

పార్టీ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు కోసమే అద్వానీ పని చేశారని, పని చేస్తున్నారని బిజెపి సీనియర్ నేత జశ్వంత్ సింగ్ అన్నారు. అద్వానీ తన లేఖలో ప్రస్తావించిన అంశాలను పార్టీ అధిష్టానం ఓసారి పరిశీలించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బిజెపి నేత ఠాకూర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+