స్కూల్ ఓనర్‌కు షాక్: ఒబామా ఫొటోతో అడ్మిట్ కార్డు

జైపూర్: రాజస్థాన్ పాఠశాల యజమానికి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫొటో అతికించిన అడ్మిట్ కార్డు తన పేరు మీద రావడంతో ఆయన షాక్ తిన్నారు. ఢిల్లీ సెంటర్ నిర్వహించిన జానియర్ ఇంజనీర్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డు అది.

ఆర్డినరీ పోస్టులో తనకు జూన్ 8వ తేదీన వచ్చిన లేఖను తీసుకుని విప్పి చూసిన 40 ఏల్ల లాలూ రామ్ మీనా ఆశ్చర్యానికి గురయ్యాడు. తర్వాతి రోజు జరిగే పరీక్షకు అతను దరఖాస్తు కూడా చేసుకోలేదు. కార్డుపై సంబంధిత అధికారం సంతకం, సీల్ ఉన్నాయి. రూల్ నెంబర్ - 2201000509. బాదర్పూర్‌లోని తుగ్లకాబాద్ మెట్రో స్టేషన్ వద్ద పరీక్షా కేంద్రం అని ఉంది.

Did Prez Obama apply for engg exam in Rajasthan?

కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జనరల్ ఇంజనీరింగ్ పార్టీ బి ఎలక్ట్రికల్‌లో ఆ పరీక్ష నిర్వహిస్తోంది. తన పేరుతో అడ్మిట్ కార్డు చూసి ఆశ్చర్యపోయానని, తాను ఆ పరీక్షకు దరఖాస్తు కూడా చేసుకోలేదని ఆయన అన్నారు.

అడ్మిట్ కార్డులో అభ్యర్థిగా బరాక్ ఒబామా చాయాచిత్రం అతికించి ఉండడం తనను మరింత ఆశ్చర్యానికి గురి చేసినట్లు తెలిపారు. ఒబామా చిత్రం కింద సంతకం ఉందని, ఆ సంతకం కూడా తనది కాదని నలుగురు పిల్లల తండ్రి రామ్ అన్నారు. జన్మించిన తేదీ 1987 అక్టోబర్ 5గా కార్డులో ఉంది. రామ్ జన్మించిన తేదీ 1973 జనవరి 1. అనతు ఆర్ట్స్ డిగ్రీ చదివాడు. ఆ తర్వాత బిఇడి చేసి దౌసాలోని రంబాస్ గ్రామంలో పాఠశాల నడుపుతున్నాడు. దౌసా జిల్లా కలెక్టర్ ముక్తానంద్ అగర్వాల్ అటువంటి విషయమేదీ తన దృష్టికి రేలాదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+