ఛలో అసెంబ్లీపై టిటిడిపి తర్జన, స్వేచ్ఛ ఇచ్చామని బాబు

ఈ కార్యక్రమానికి టిడిపి మద్దతు కావాలని ఐకాస కోరలేదని, వాళ్లు అడగనప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నించగా, టిడిపి మద్దతు తీసుకోవాలని ఐకాసలో అనేకమంది భావిస్తున్నా తెలంగాణ రాష్ట్ర సమితి ఒత్తిడి వల్ల వెనక్కి తగ్గుతున్నారని మరికొందరు అభిప్రాయపడ్డారట. దీనిని దృష్టిలో ఉంచుకొని మద్దతిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట.
మరికొందరు మాత్రం మనం తెరాస తోక పట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదని, వాళ్ల కార్యక్రమాలు వారిని చేసుకోనివ్వాలని, మనం సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేద్దామని సూచించారట. మూడు వాదనలు విన్న చంద్రబాబు తెలంగాణపై పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పామని, మహానాడులో తీర్మానం కూడా చేశామని, దానిని అవకాశంగా తీసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సూచించారు.
మీకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు దానిని ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారని ప్రశ్నించారట. చలో అసెంబ్లీపై ఏ వైఖరితో వెళ్లాలో ఫోరం నేతలు తమలో తాము చర్చించుకొని నిర్ణయించుకోవాలని, పార్టీకి ఏది లాభమైతే అది చేయాలని సూచించారు. బుధవారం దీనిపై మరోసారి భేటీ కావాలని వారు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications