మరో 5 జియా ఖాన్, సూరజ్ లేఖలు స్వాధీనం

జియా ఖాన్ మరణించిన మూడు రోజుల తర్వాత ఆమె రాసిన లేఖను ఆధారం చేసుకుని బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తనను రేప్ చేశాడని, బెదిరించాడని, మోసం చేశాడని లేఖలో జియా సూరజ్‌పై ఆరోపణలు చేసింది.
తెగదెంపులు చేసుకోవడానికి తన కూతురిని సూరజ్ కొట్టాడని, మెడపై, చెంపపై అందుకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని జియా ఖాన్ తల్లి రబియా ఆరోపించారు. జియా ఖాన్ ఆత్మహత్యకు అదే కారణమని రబియా అన్నారు. జియా ఖాన్‌ను సూరజ్ కొట్టాడా, లేదా అనే విషయం పోస్టుమార్టంలో తేలనుంది.
అబార్షన్‌కు సంబంధించి మరింత సమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అబార్షన్ చేయించుకున్నట్లు జియా ఖాన్ తన ఆరు పేజీల లేఖలో చెప్పింది. అబార్షన్ చేయించుకున్న ఆనవాళ్ల కోసం తాము వైద్యులను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!