పవర్: సోనియా అల్లుడు వాద్రా ఆర్‌టిఐకి అతీతుడు

వాద్రాకు సంబంధించిన వివరాలు అత్యంత రహస్యమని చెప్పి తప్పించుకుంది. ఆ వివరాలను వెల్లడించడం సాధ్యం కాదని పిఎంవో ఆర్టిఐ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇటీవల ఇదే అంశంపై వివరాలు కావాలని అడిగితే ఇది న్యాయస్థానం పరిధిలోని అంశమని సమాచారం ఇవ్వకుండా దాటేసింది. వాద్రాకు పలు వ్యాపారాలున్నాయి. కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో ఆయన అనుచిత రీతిలో భూములు పొందారనే ఆరోపణలు ఉన్నాయి.
డిఎల్ఎఫ్ - వాద్రాల మధ్య ఒప్పందంలో అక్రమాలు జరిగాయని నిరుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెసు, బిజెపి, సిపిఎం, సిపిఐ, ఎన్సీపి, బిఎస్పీలను ఆర్‌టిఐ కిందికి తెస్తూ సిఐసి ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చింది.
సిఐసి ఉత్తర్వుల కింద పౌరులు రాజకీయ పార్టీల విరాళాలు, వ్యయం, అభ్యర్థుల ఎంపిక వంటి విషయాలను ఆర్‌టిఐ కింద పొందవచ్చు. అయితే, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మాత్రం ఆర్‌టిఐకి అతీతుడుగా కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications