వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడి చేయాలని విజయమ్మ చెప్పారు: రాజేష్ సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - Maddala Rajesh
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో దూకుడుగా మాట్లాడారు. పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎవరైనా విమర్శలు చేస్తే.. భౌతిక దాడులు చేయాలని పిలుపునిచ్చారట.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "విజయమ్మ గారు మాకు చెప్పిన విషయం ఒకటుంది. జైలులో జగన్మోహన్ రెడ్డి మద్యం సేవిస్తున్నట్టు.. నీలి చిత్రాలు చూస్తున్నట్టు టిడిపి విమర్శిస్తోంది. సాధ్యం కాని విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టిడిపి క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఆ విధంగా మాట్లాడుతోంది. కాబట్టి అటువంటి వ్యాఖ్యలను ఖండించడంతో పాటు అవసరమైతే ఈ వ్యాఖ్యలు చేసే వారిపై భౌతిక దాడులకు దిగడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని కూడా విజయమ్మ గారు చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఉండే కార్యకర్తలందరికీ ఈ విషయం చెప్పమని విజయమ్మగారు చెప్పడం జరిగింది'' అని రాజేష్ చెప్పినట్లుగా దినపత్రికలో వచ్చింది.

అతి త్వరలో జగన్ జైలు నుంచి రాబోతున్నట్లు కూడా విజయమ్మ చెప్పారన్నారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఆయన బయటికొచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయన్నారు. పార్టీని విమర్శిస్తూ ప్రెస్‌లో మాట్లాడే నాయకులు మళ్లీ వైయస్సార్ కాంగ్రెసు పెద్దలకు ఫోన్ చేసి నెల రోజుల్లో పార్టీలోకి వచ్చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ఖండనలను గుప్పించాలని కూడా విజయమ్మ స్వయంగా చెప్పారని వెల్లడించారు. "ప్రతిరోజూ పేపర్లలో ఖండనలు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారని, సాధారణంగా ఎవరు ప్రెస్‌మీట్ పెట్టినా, మన నాయకులను విమర్శించినా వెంటనే మనం స్పందించడం లేదని అంటున్నారని, నేతలు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ తరపున ఖండనలు ఇవ్వాలని, మనం టార్గెట్ చేసేది కాంగ్రెస్, టిడిపిలనే అని చెప్పారు. ఆ పార్టీల నాయకులను టార్గెట్ చేసి ప్రెస్‌మీట్‌లు పెట్టాలని తనతో చెప్పడం వలనే ఈ విషయం చెబుతున్నానని రాజేష్ అన్నారు.

మద్దాల రాజేష్ అలా అని ఉండడని భావిస్తున్నానని, అలా అంటే మాత్రం ఆయన మాటలను తాను ఖండిస్తున్నానని అంబటి రాంబాబు చెప్పారు.

English summary

 YSR Congress MLA Maddala Rajesh make controversial comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X