వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్తి: కొడుకుతో కుమార్తె పెళ్లికి తండ్రి యత్నం, భగ్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Father arrested in Bangalore
బెంగళూరు: కన్న కూతురిని సొంత కొడుక్కే ఇచ్చి వివాహం చేసే ప్రయత్నం చేశాడు ఓ తండ్రి. కుమార్తెకు వేరే వ్యక్తితం పెళ్లి చేస్తే ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని భావించిన ఈ దుర్మార్గపు తండ్రి తన మొదటి భార్య కూతురుకు రెండో భార్య కొడుకును ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు.

మొదటి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అరెస్టు చేశారు. బుధవారం బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది. రాజధానిలోని దావణగెరెకు చెందిన శివ కుమార్ తన ఆస్తిని విక్రయించి రెండు నెలల క్రితం అత్తిబెలె సమీపంలోని నెరళూరుకు వచ్చాడు.

అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. శివ కుమార్ మొదటి భార్యకు పదహారేళ్ల కుమార్తె ఉంది. రెండో భార్యకు కొడుకు ఉన్నాడు. కుమార్తెను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆస్తి ఇతరుల పాలు అవుతుందని రెండో భార్యతో కలిసి పథక రచన చేశాడు. మొదటి భార్యను దావణగెరెలోనే ఉంచి కుమార్తెను, కొడుకును, రెండో భార్యను నెరళూరుకు తీసుకు వచ్చాడు.

వారిద్దరికి వివాహం చేయడానికి తేది నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి నెరళూరుకు చేరుకొని భర్త, రెండో భార్యతో గొడవ పడింది. ఆమె స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బాలికను రక్షించారు. శివ కుమార్‌ను అరెస్టు చేసి అతనిపై కేసు నమోదు చేశారు.

English summary
Father arrested in Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X