యువరాజ్ ఫిక్స్‌చేస్తే కాల్చేస్తా, కపిల్ సారీ చెప్పి..: తండ్రి

ఓ ఇంటర్వ్యూలో ఐపిఎల్‌లో ఫిక్సింగ్ గురించి ప్రస్తావించినపుడు ఆయన ఎటువంటి తడబాటు, దాట వేత ధోరణి లేకుండా యువీ తలలో తూటా పేలుస్తానంటూ తీవ్రంగా స్పందించాడు. బాలీవుడ్‌లో ప్రవేశానికి యువరాజ్ సాయం తీసుకున్నారా? అని ప్రశ్నించగా అటువంటుదేమీ లేదన్నాడు.
తాను క్రికెట్ ఆడే రోజల్లో కొంతమంది కాళ్లు పట్టుకుని వుంటే ఇంకొంతకాలం క్రికెట్ ఆడేవాడినని, తాను ఆ పని చేయలేదని చెప్పాడు. తనకు ఆకలిగా ఉన్నపుడు కూడా తన కుమారుడ్ని డబ్బులు అడగలేదన్నాడు. క్రికెట్ ఆడిన రోజుల్లో బిషన్ సింగ్, కపిల్ దేవ్‌లు.. ఆట నుంచి తనను బయటికి గెంటినపుడూ తల వంచలేదన్నాడు.
ఒకవేళ తలవంచాల్సివస్తే చావనైనా చస్తానుగానీ తలవంచేది లేదన్నాడు. యువరాజ్‌కు గానీ అతని తల్లికి గాను మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాత్ర ఉన్నట్టు తేలితే సహించేది లేదని తీవ్రంగా స్పందించాడు. ఫిక్సింగ్‌లో యువీ భాగస్వామి అయితే.. అతని తలలో తుపాకీ తూటా పేలుస్తానని తీవ్రస్వరంతో అన్నారు.
అమరజవాన్ల జ్యోతి వద్ద వాడిని ఉరి తీస్తానని, ఇది ఈ దేశం నెత్తుటి ప్రతిజ్ఞ అని భావోద్వేగంతో చెప్పారు. నిన్నటితరం సీనియర్ క్రికెటర్లు బోధించిన దాన్నే నేటి తరం జూనియర్లు అచరిస్తున్నారని, తనకు గుర్తున్నంతలో డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన దావూద్ ఇబ్రహీంను కపిల్ గెటౌట్ అని బయటకు పంపించాడన్నారు.
అతనెవరో తెలిశాక వెనక్కి పరుగెత్తి సారీ చెప్పి.. మరీ డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాడన్నారు. అప్పుడు నాటిన విషపు విత్తనాలు ఇప్పుడు పంటకొచ్చాయన్నారు. అయితే రూ.25 లక్షలు బదులుగా రూ.కోటి.. తేడా మాత్రం అంతే అన్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications