జమ్మూ ప్రమాదంలో ఆంధ్ర ఐఎఎస్ దంపతుల మృతి

విహార యాత్రలో ఉన్న వీరు జమ్ములోని ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, ఒక వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ వాహనంలోని వారంతా మరణించారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఎఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ధర్మారావు ఇద్దరు కుమారులు వేరే కారులో ఉండటంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ధర్మారావు 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. చాలా కాలంగా మధ్యప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన ధర్మారావు ఆంధ్రా యూనివర్శిటీలో బిటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత ఐఐఎం చేసి, సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారిగా పనిచేస్తున్న ధర్మారావు అదే రాష్ట్రానికి చెందిన విద్యారావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా అక్కడే మధ్య ప్రదేశ్‌లోనే ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నారు.
ధర్మారావు దంపతుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో శుక్రవారం విశాఖ నగరానికి తరలించనున్నారు. శనివారం అంత్యక్రియలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications