రాయల్ యువతితో శ్రీశాంత్ పెళ్లి, స్వామివారి దర్శనం?

రెండు రోజుల క్రితం శ్రీశాంత్ ఇంటికి చేరుకున్నాడు. అంతకుముందే శ్రీశాంత్ వివాహంపై ప్రచారం జరిగింది. ఇప్పుడు విడుదల తర్వాత మరోసారి పెళ్లి అంశం ప్రస్తావనకు వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ తన సోదరుడు దీపుతో కలిసి అయ్యప్ప స్వామి వారిని దర్సించుకోనున్నారట.
కేసు నుండి బయటపడేయాలని శ్రీశాంత్ కోరుకోవడంతో పాటు వివాహం కోసం కూడా స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నారట. వచ్చే సెప్టెంబరులో కేరళవాసులు ఓనమ్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో శ్రీశాంత్ పెళ్లి ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.
శ్రీశాంత్ వివాహం జైపూర్‌కు చెందిన ఓ రాయల్ కుటుంబానికి చెందిన యువతితో జరగనుందనే ప్రచారం సాగుతోంది. కేరళలోని గురువాయూర్‌లో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. యువతి ఎవరనే విషయాన్ని శ్రీ కుటుంబ సభ్యులు చెప్పనప్పటికీ కేరళేతర యువతితో పెళ్లి ప్రపోజల్ వచ్చిందని చెబుతున్నారు.
యువతిని తమ కుటుంబ సభ్యులు చూడలేదని, తాము వారి నుండి ప్రపోజల్ వచ్చిందని శ్రీశాంత్ సోదరి విదిత చెప్పారు. కాగా శ్రీశాంత్ సోదరి భర్త మధు బాలకృష్ణ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications