విజయమ్మ అరెస్టు: వర్ల, చిరు తాకట్టు: షర్మిల

Varla Ramaish and YS Sharmila
విజయవాడ/ కాకినాడ: తన కుమారుడు వైయస్ జగన్‌ను వ్యతిరేకించేవారిపై భౌతికదాడులు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయలక్ష్మి చెప్పారన్న చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాలి రాజేష్ మాటలపై విచారణ జరిపించాలని, ఆ మాటలు నిజమని తేలితే విజయమ్మను అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు మద్దా ల రాజేష్‌కుమార్, ఆ పార్టీ నాయకురాలు విజయలక్ష్మిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు జంగారెడ్డి గూడెంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎవరికైనా మద్దతు: షర్మిల

ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రభుత్వంపై ఏ రాజకీయ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా తాము మద్దతు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రకటించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గురువారం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ చేరుకున్న ఆమె స్థానిక జగన్నాథపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఫల్యం చెందారని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనకుండా విప్ జారీచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి యథాశక్తి సహకరించారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వ్యూహాత్మకంగా కాలయాపన చేసి, చివరి పది నెలల కాలంలో వేటు వేశారని విమర్శించారు.

ఉప ఎన్నికలను నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. 70 లక్షల మంది ఓటు వేసిన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌కు తాకట్టుపెట్టి అమ్ముడుపోయారని, చంద్రబాబు సైతం ఇదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతూ అమ్ముడుపోయారని అన్నారు. చంచల్‌గూడ జైలులో జగన్‌తో నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్‌లు జరుగుతున్నాయంటూ బాబు గగ్గోలు పెడుతున్నారని, దీనిపై జైలు అధికార్లు ఇచ్చిన సమాచారంపై వారు సంతృప్తి చెందకపోవడం దారుణమని ఆమె అన్నారు.

కేంద్రమంత్రి చిరంజీవి ఇంట్లో నిర్వహించిన సిబిఐ తనిఖీల్లో కోట్లాది రూపాయల సొమ్ము వెలుగుచూసినా ఆ వ్యవహారం ఏమైందో నేటికీ బయటకు చెప్పడంలేదన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మద్యం మాఫియా డాన్‌గా వారి పార్టీకి చెందిన వారే విమర్శిస్తున్నప్పటికీ దీనిపై కూడా వారు సమాధానం చెప్పడంలేదని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+