కెకెకు కీలక పోస్ట్, కెసిఆర్కోసం జగన్ 'డమ్మీ' ప్లాన్: బోడ

కెసిఆర్ కోసం జగన్ డమ్మీ అభ్యర్థులు!: బోడ
తెలంగాణ రాష్ట్ర సమితి కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంతంలో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశముందని ఆ పార్టీ సీనియర్ నేత బోడ జనార్ధన్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. అదిలాబాద్ కన్వీనర్‌గా ఉన్న బోడతో పాటు సోయం బాబు తదితరులు రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా బోడ మాట్లాడారు. తమ కష్టాన్ని పార్టీ గుర్తించలేదని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎదుగుతుందని భావించామన్నారు. కానీ ఆ సూచనలు కనిపించడం లేదన్నారు. వచ్చే ఎన్నికలలో తెరాస, వైయస్సార్ కాంగ్రెసులు కలిసి పని చేసే అవకాశాలున్నాయన్నారు. అందుకే పార్టీ స్థాపించి మూడేళ్లైనా క్యాడర్‌ను అభివృద్ధి చేసుకోలేదని ఆరోపించారు.
పార్టీ వచ్చే ఎన్నికలలో డమ్మీ అభ్యర్థులను నిలిపి, తెరాసకు లబ్ది చేకూర్చే ప్రయత్నాలు చేసే అవకాశముందన్నారు. అందుకే తాను చేసిన సూచనలను పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అందుకే తాము రాజీనామా చేస్తున్నట్లు బోడ జనార్ధన్ ప్రకటించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications