మోడీకి ప్రశంస: నితీష్ కుమార్‌కు వీడియో చిక్కులు

మోడీ కారణంగా బయటకు వెళ్లిన నితీష్ పైన ఆయన పాత వీడియోలను విడుదల చేసి బీహార్ బిజెపి ఎదురుదాడికి సిద్ధపడింది. గతంలో నితీష్... మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. గోద్రా అల్లర్ల అనంతరం 2003లో నితీష్ ఓ సందర్భంలో మాట్లాడుతూ... మోడీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారన్నారు. గోద్రా అల్లర్లు బాధాకరమని చెబుతూనే.. మోడీని పొగిడారు. మోడీని అప్పట్లో నితీష్ పొగిడిన వీడియోలను బిజెపి బయట పెట్టి ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.
లౌకికవాదిని: నితీష్
తాను ఎప్పటికీ లౌకికవాదినేనని బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అగ్రనేత నితీష్ కుమార్ సోమవారం సాయంత్రం చెప్పారు. తాను లౌకికవాదినని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పడం సంతోషకరమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
ఎన్డీయేతో జెడి(యు) తెగతెంపులు చేసుకోవడంలో ఎలాంటి దురుద్దేశ్యం లేదని చెప్పారు. దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నితీష్ కుమార్ చెప్పారు.
అద్వానీని కలిసిన మోడీ
నరేంద్ర మోడీ అగ్రనేత అద్వానీని మంగళవారం కలుసుకున్నారు. బిజెపి ప్రచార కమిటీ సారథిగా ఎంపికైన మొదటిసారి ఆయన అద్వానీని కలిశారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications