బిటెక్ గ్రాడ్యుయేట్ నిర్వాకం: అత్తకు అశ్లీల మెసేజ్‌లు

అయితే ఈ పెళ్లి సమీ ర్ అత్త, మామలకు ఇష్టం లేదు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత డబ్బు కోసం సమీర్ తన అత్తను వేధించడం మొదలుపెట్టాడు. డబ్బు ఇచ్చేందుకు అత్త నిరాకరించడంతో చివరకు అశ్లీల ఎస్‌ఎంఎస్‌లను పంపాడు. దీంతో ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతోసహా పట్టుబడ్డ సమీర్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
విజయవాడలోని పెనమలూరు నుంచి నిందితుడు బిటెక్‌లో గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నాడు. బాధితురాలి కూతురు కూడా అదే కళాశాలలో చదివింది. చదువుకునే సమయంలో వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
తెలియని ఫోన్ల నుంచి సమీర్ బాధితురాలికి మెసేజ్‌లు పంపుతూ వచ్చాడు. ఎనిమిది నెలల క్రితం సమీర్ అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్ వివరాల ఆధారంగా పోలీసులు సమీర్‌ను అరెస్టు చేశారు. సిమ్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications