సోనియా గాంధీ చెప్తే చీపురు పట్టి ఊడుస్తా: పిసిసి చీఫ్

సోనియా ఆదేశిస్తే చీపురు పట్టుకొని కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. తాను సోనియా, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశాలను పాటిస్తానని, ఉదాహరణకు వారు... తనను కార్యాలయం శుభ్రం చేయమంటే అందుకు కూడా సిద్ధమని వ్యాఖ్యానించారు.
చరణ్ దాస్ మహంత్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించింది. ఆయన అధిష్టానానికి భజనపరుడిగా మారారని, పిసిసి అధ్యక్ష పదవిని నాలుగో శ్రేణి ఉద్యోగి స్థాయికి దిగజార్చారని ఎద్దేవా చేసింది. పదవుల కోసం మరీ అంతగా భజన చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రజలు ఇలాంటి వారిని సమ్మతించరని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శివరతన్ శర్మ అన్నారు. చరణ్ దాస్ మహంతి విలేకరుల ముందు పై వ్యాఖ్యలు చేసి, అధిష్టానం పట్ల తన భక్తిని చాటుకున్నారు.












Click it and Unblock the Notifications