గాలికి నో బెయిల్: ఐఎంజిపై జగన్ పార్టీకి టిడిపి కౌంటర్

అంతర్జాతీయ కోర్టులు కావాలా?: పయ్యావుల ఎద్దేవా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఐఎంజి భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, వాటిపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం అనుమతివ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబుకు ఇరవై ప్రశ్నలతో కూడిన లేఖలు కూడా రాసింది.
ఐఎంజి భూముల వ్యవహారం అంశాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లేవనెత్తడంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. ఐఎంజి వ్యవహారంలో విజయమ్మ గతంలో కోర్టు వ్యాఖ్యలను చదవాలని సూచించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఐఎంజిపై సిబిసిఐడి ఇచ్చిన నివేదికను చూడలేదా అని ప్రశ్నించారు.
బాబు హయాంలో భూ కేటాయింపులపై విచారణకు ఆదేశిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. అప్పుడు నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. మీరు భూ కేటాయింపులపై విచారణకు కోరుకోవచ్చునన్నారు. గతంలో అనేక కోర్టులు అక్రమాలు జరగలేదని తేల్చి చెప్పాయని, బాబు నిజాయితీకి ఇంకెన్ని కోర్టులు కావాలని ప్రశ్నించారు. అంతర్జాతీయ కోర్టులు కావాలా అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications