ఉత్తరాఖండ్ బీభత్సం: ఐదుగురు విశాఖవాసుల మృతి

విశాఖకు చెందిన ఐదుగురు ఉత్తర కాశీలో మృతి చెందినట్లు ఉత్తరాఖండ్ అధికారులు సమాచారం అందించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వరదల్లో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంకు చెందిన వీరభద్రప్ప మృతి చెందిన విషయం తెలిసిందే.
ఉత్తర కాశీ, చార్ ధామ్ యాత్రకు వెళ్లిన అక్కడే చిక్కుకుపోయిన యాత్రికులలో హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన 25 మంది ఉన్నారు. కొండచరియలు విరిగిపడ్డాయని, అక్కడి పరిస్థితులపై వస్తున్న వార్తలతో ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఎలాగైన ప్రభుత్వం స్పందించి ఉత్తర కాశీ యాత్రకు వెళ్లిన నగరవాసులను రక్షించాలని కోరుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 25 మంది ఉన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూరి గ్రామానికి చెందిన 18 మంది యాత్రికులు గంగోత్రిలో చిక్కుకుపోయారు.












Click it and Unblock the Notifications