సజావుగా సాగుతున్న సమావేశాలు, తెరాస సహకారం

సభ సజావుగా సాగడంపై అసెంబ్లీ లాబీల్లోను చర్చ సాగుతోందట. గత మూడున్నరేళ్లలో సభ ఇంత సజావుగా సాగడం ఇదే మొదటిసారి కావొచ్చునని అంటున్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో మినహా ఇప్పుడు ఇంత ప్రశాంతంగా కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణ ప్రాంత నేతలతో పాటు తెరాస ఎమ్మెల్యేలు సభలో నిశ్శబ్దంగా కూర్చోవడంపై లాబీల్లో చర్చ సాగుతోందట. సభ నిండుగా కనిపిస్తోంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్ర గవర్నర్ సలహా తీసుకుంటే కాంగ్రెసు పార్టీ మనుగడ ఉండదని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం అభిప్రాయపడ్డారు. తెలంగాణకు ప్యాకేజీలు ఒప్పుకునేది లేదన్నారు.
తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరించేందుకు సీమాంధ్ర మంత్రులు, ఇతర నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 30వ తేదిన నిజాం కళాశాలలో భారీ బహిరంగ సభను తలపెట్టినట్లు చెప్పారు. ఆ సభ ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరోసారి కేంద్రానికి తెలియజేస్తామన్నారు.












Click it and Unblock the Notifications