పెళ్లి పేరుతో డబ్బుతో పరారైన టెక్కీ, ఉద్యోగులే టోకరా..

పెళ్లికి ముందు యువతి తల్లిదండ్రుల నుండి డబ్బులు తీసుకొని పరారయ్యాడు. యువతి బంధువులు చీరాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సతీష్ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాదులోని ఆయన తల్లిదండ్రులను చీరాల పోలీసులు అరెస్టు చేశారు.
పని చేసిన ఉద్యోగులే టోకరా
చిత్తూరు జిల్లా తిరుపతిలో పని చేసిన ఉద్యోగులే ఓ బ్యాంకుకు టోకరా వేశారు. ట్రావెన్ కోర్ బ్యాంకులో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు రూ.70 లక్షల పేర బ్యాంకుకు టోకరా వేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు వారు బంగారాన్ని బ్యాంకులో పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని మోసం చేసినట్లుగా తెలుస్తోంది. బ్యాంకులో నాలుగు రోజుల్లో రూ.23 లక్షలు గల్లంతు కావడంతో విషయం వెలుగు చూసింది.
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
ఖమ్మం జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని విడిఓస్ కాలనీకి చెందిన శ్రీనివాస్, మంగ గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తాము ఆత్మహత్య చేసుకున్నట్లు వారు సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications