యశ్వంత్: మరణించి.. ఐదుగురికి ప్రాణ దానం చేశాడు

అతను కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. జగద్గిరిగుట్టకు చెందిన యశ్వంత్ చందానగర్ సమీపంలో ఈ నెల 15వ తేదిన కేటరింగ్‌కు వెళ్లాడు. అక్కడి నుండి తిరిగి వస్తూ తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కాడు. మార్గమధ్యలో ఆటోలో నుండి జారిపడ్డాడు.
దీంతో అతని తలకు డివైడర్ తగిలి, తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని నిమ్స్‌లో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా బుధవారం పరిస్థితి విషమించింది. యశ్వంత్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. జీవన్‌దాన్ ప్రతినిధులు అతని కుటుంబ సభ్యులను అవయవదానానికి ఒప్పించారు.
దీంతో గురువారం పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురికి యశ్వంత్ మూత్రపిండాలు, కాలేయం, రెండు గుండె కవాటాలను అమర్చినట్లు జీవన్‌దాన ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications