మగాడివైతే రా, కాళ్లు పట్టు: బాబుకి, రాధాకృష్ణకి కెటిఆర్

తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. విచారణలో తాను ఎలాంటి తప్పు చేయలేదని తేలితే చంద్రబాబు, రాధాకృష్ణ తన కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. చంద్రబాబు మగాడైతే ముందుకు రావాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో దాక్కోవడం కాదన్నారు. తనపై అడ్డగోలు కథనాలు రాశారన్నారు.
మీడియాలో వచ్చిన అవాస్తవాలను టిడిపి వారు మాట్లాడితే వారిపై కూడా పరువు నష్టం దావా వేస్తానన్నారు. తాను తమ ఆస్తులపై విచారణకు సిద్ధమని, చంద్రబాబు తన ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. సకల జనుల సమ్మె సమయంలో చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. చీకట్లో చంద్రబాబు కేంద్రమంత్రి చిదంబరాన్ని కలిశారన్నారు. బాబు బతుకేందో ప్రజలకు తెలుసునని చెప్పారు.
జయశంకర్‌కు నివాళులు
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌కుతెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో నివాళులు అర్పించారు. శుక్రవారం ఆయన రెండో వర్ధంతి.












Click it and Unblock the Notifications