కుక్కలు కాదు గుంటనక్కలు: రేవంత్, ఎమ్మెల్యేలకి గిఫ్ట్స్

Revanth Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు తెలంగాణకు కాపలు కుక్కలు కాదని, గుంట నక్కలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఐఎంజి కేసులో క్లీన్ చిట్ వచ్చిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

బాబుకు ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే వారు పదేపదే వారు తమ పార్టీ అధినేత పైన అనవసర ఆరోపణలు గుప్పిస్తూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఉద్యమం ముసుగులో తెలంగాణ ప్రజలను తెరాస నాయకులు దోచుకుంటున్నారని, విద్యార్థుల శవాల మీద పునాదులు నిర్మించుకుంటున్నారని, భూవివాదంలో కెటిఆర్ భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వానికి ఎందుకు సహకరించారని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్ ఉంది కాబట్టే ప్రజలు వారిని భరిస్తున్నారని లేదంటే తరిమికొట్టేవారన్నారు. తెరాస మీడియా సంస్థలో వ్యాపార ప్రకటనలు అన్నీ సీమాంధ్ర సంస్థలవే అన్నారు.

టిడిపిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైంది. సభలో తమ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పైన సభా హక్కుల నోటీసు ఇవ్వడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ వారు లేఖను ఇవ్వనున్నారు.

అసెంబ్లీ నిరవధిక వాయిదా, ఎమ్మెల్యేలకు గిఫ్ట్స్

అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహుమతులను ఇచ్చారు. ఆర్థిక శాఖ నుండి టాబ్లెట్స్, ఎపిఐసిసి నుండి రూ.5వేల గిఫ్ట్ ఓచర్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+