కోర్టుకు సబిత, అంబులెన్స్‌లో శ్రీలక్ష్మి: శంకరన్నపై కేసు

Sabitha Indra Reddy and Srilaxmi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో దాల్మియా ఛార్జీషీటుకు సంబంధించి విచారణ జూలై 1వ తేదికి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి పలువురు కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్, విజయ సాయి రెడ్డిలను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ జరిపింది. దాల్మియా ఛార్జీషీటుకు సంబంధించిన కేసులో మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రాజగోపాల్, పునీత్ దాల్మియా, సంజయ్ మిత్ర తదితరులు కోర్టుకు హాజరయ్యారు.

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా కోర్టుకు వచ్చారు. ఆమె అంబులెన్సులో కోర్టు వద్దకు వచ్చారు. అనారోగ్యం కారణంగా తాను కోర్టు మెట్లు ఎక్కలేనని, కింద అంబులెన్సులో ఉన్నట్లు శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపింది. మరోవైపు సబితా సమర్పించిన రెండు పూచీకత్తులను సిబిఐ ఆమోదించింది. అయితే పూచీకత్తులు ఆమోదించినంత మాత్రాన స్వేచ్ఛ కల్పించినట్లు కాదని కోర్టు తెలిపింది.

మోపిదేవి బెయిల్ పిటిషన్ వాయిదా

జగన్ ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్ పైన తీర్పును ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది.

నా ప్రమేయం లేదు: కన్నా

రాంకీ కేటాయింపుల వ్యవహారంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ వేరుగా అన్నారు. సిబిఐ ఛార్జీషీటు అదే తెలియజేస్తోందన్నారు.

శంకర రావుపై మరో కేసు

మాజీ మంత్రి శంకర రావుపై శుక్రవారం మరో కేసు నమోదయింది. ఈ ఏడాది మే 1వ తేదిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పోలీసు శాఖపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఓ వ్యక్తి హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన కోర్టు శంకర రావుపై కేసును నమోదు చేయాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. దీంతో 500, 506తో పాటు పోలీసు సెక్యూరిటీ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు. ఇప్పటికే శంకర రావు తన వంశీప్రియ కేసును ఎదుర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+