కెటిఆర్! కిరణ్‌ను ఎందుకు కలిశావ్?, మేం సిద్ధం: టిడిపి

తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెసు పార్టీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఆస్తులను పూర్తిగా బయటపెట్టారని, అలాగే తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కెటిఆర్ తమ ఆస్తులను బయటపెట్టాలని సవాల్ చేశారు. వారి బినామీ ఆస్తులను బయట పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
కెసిఆర్‌కు దమ్ముంటే ఆస్తుల వివరాలను చెప్పగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ను కాలితో తన్ని వ్యక్తి కెసిఆర్ అని దుయ్యబట్టారు. తెలంగాణ పైన తాము ఏ విధంగా లేఖ రాసేందుకైనా సిద్దమేనని వారు సవాల్ చేశారు. లేఖ మీరు రాసిస్తే తమ పార్టీ అధ్యక్షుడు సంతకం చేస్తారని అన్నారు.
కాగా ఆంధ్రజ్యోతిలో కెటిఆర్ సెటిల్మెంట్ అంటూ వచ్చిన కథనం రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు.












Click it and Unblock the Notifications