ప్రముఖ రచయిత ఆలూరి భుజంగరావు కన్నుమూత

Aluri Bhujanaga Rao
గుంటూరు: ప్రముఖ అనువాదకుడు, విరసం నేత ఆలూరి భుజంగరావు (84) గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య లలిత, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చాలాకాలం బెంగళూరులోని కుమారుడి వద్ద ఉన్న భుజంగరావు దంపతులు కొద్దికాలం గా గుంటూరులో నివాసం ఉంటున్నారు. తెనాలిలో హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించి ప్రసిద్దమైన తెలుగు నవలలు రాసిన శారద ప్రభావంతో ఆయన రచయితగా మారారు

కష్టపడి హిందీ భాషను అభ్యసించి ఎంతో విలువైన సాహిత్యాన్ని హిందీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి అనువదించారు. షహీద్ భగత్‌సింగ్ వంటి రచనలను తెలుగువారికి అందించారు. ఈ క్రమంలో కమ్యూనిస్టు ఉద్యమాలకు దగ్గరై విప్లవ రచయితల సంఘం (విరసం)లో చేరి, చివరివరకూ కొనసాగారు.

భుజంగరావు స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతం కొండముది. బ్రాహ్మణ కుటుంబంలో 1928లో వెంకటప్పయ్య, సీతారామమ్మల దంపతులకు ఆయన జన్మించారు. ఆయన బాల్యం, యవ్వనం తెనాలిలో దుర్భర దారిద్య్రంలో గడిచాయి. హోటల్ కార్మికునిగా ఉండగా అక్కడే పనిచేస్తున్న శారద (నటరాజన్)తో ఏర్పడిన సాన్నిహిత్యం, రావూరి భరద్వాజ స్నేహం, ధనికొండ హనుమంతరావు లాంటి దాతల చేయూతతో ఆయన సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. కష్టపడి చదివి కృష్ణాజిల్లా గుడివాడలో హిందీ ఉపాధ్యాయుడిగా జీవనం సాగించారు. శారదను విస్మరించకుండా స్మృతి శకలాలు పేరుతో 'సాహిత్య బాటసారి శారద' పుస్తకాన్ని రచించారు.

ప్రముఖ బౌద్ధ తాత్వికుడు రాహుల్ సాంకృత్యాయన్ రచనలు జయమేజయుడు, విస్తృతయాత్రికుడు, దివోదాసు- లోకసంచారి, దర్శన్ దిగ్దర్శన్, వైజ్ఞానిక తార్కిక భౌతికవాదం తదితర రచనలను తెలుగులోకి అనువదించారు. జాతీయోద్యమ కాలంలో ఒక పాయగా కొనసాగిన భగత్‌సింగ్ తదితరుల విప్లవ పోరాటానికి సంబంధించి తెలుగు ప్రజలకు అంతగా తెలియని కొత్త సంగతులతో నిండిన యశ్‌పాల్ 'సింహావలోకనం' ఆత్మకథను అందించారు. జనార్దన్, చక్రధర్, పెద్దన్న, పారదర్శి పేర్లతో రచనలు చేశారు. కాగా, ఆయన భౌతికకాయానికి విప్లవ రచయిత వరవరరావు నివాళి అర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+