పట్టపగలు మహిళ హత్య: ఇద్దరు దొంగల అరెస్టు

భర్త కార్యాలయానికి, పిల్లలు పాఠశాలకు వెళ్లడం గమనించి, ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆపార్టుమెంట్ వాచ్‌మన్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఇదిలావుంటే, ప్రజల కళ్లు గప్పి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను విజయవాడ పటమట పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ. 18.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరుకు చెందినవారు.
పీట్ల కిశోర్ కుమార్, పీట్ల జీవన్ కుమార్‌లుగా ఆ దొంగలను పోలీసులు గుర్తించారు. మన రాష్ట్రంలోనే కాకుండా రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో బ్యాంకుల మద్ద మాటవేసి దొంగతనాలకు పాల్పడినట్లు వారిపై పలు కేసులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications