ప్రధానిగా మోడీకి బీహార్ పట్టం: లాలూకు మేలు

సర్వే ఫలితాల ప్రకారం - ప్రధాని పదవికి జెడియు నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కన్నా నరేంద్ర మోడీని ఎన్నుకోవడానికి ఎక్కువ మంది బీహార్ ప్రజలు ఇష్టపడుతున్నారు. జాతీయ స్థాయిలో బిజెపికి, రాష్ట్ర స్థాయిలో జెడియుకు ప్రయోజనం కలుగుతుంది. బిజెపికికి లోకసభ స్థానాలు, జెడియుకు శాసనసభా స్థానాలు ఎక్కువగా దక్కుతాయి.
బిజెపితో జెడియు తెగదెంపుల వల్ల వల్ల లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కు మేలు జరుగుతుంది. లోక్‌సభలో ఆర్‌జేడీకి పెద్దగా ప్రయోజనం చేకూరదు కానీ అసెంబ్లీలో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించడానికి వీలుంది. అయితే, తక్షణమే అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఆర్‌జేడీ, రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) కలిసినా మెజారిటీ సాధించలేవు.
కాంగ్రెసు సొంతగా పోటీ చేస్తే అది ఘోరంగా పరాజయం చెందుతుంది. లాలూ, పాశ్వాన్‌లతో కలిస్తే కాంగ్రె స్‌కు మెజారిటీ రావచ్చు. జెడియు, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరితే నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. బిజెపి, జేడీయూలదే నిజంగా బలమైన పొత్తు. చీలిక తర్వాత కూడా రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగలవు. ఎన్డీయేలో చీలిక వల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 60 శాతం, జేడీయూకు 40శాతం చొప్పున ఓట్లు చీలుతాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తలకిందులవుతాయి.












Click it and Unblock the Notifications