కుక్కపై ప్రేమతో ఆత్మహత్య, వేరుశనగ ఇరుక్కుని మృతి

Student commit suicide
అనంతపురం/ హైదరాబాద్: మక్కువతో పెంచుకున్న కుక్క మరణించడంతో ఓ విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహ చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రొడ్డంలో శుక్రవారం చోటు చేసుకుంది. రొడ్డం బీసి కాలనీలో ఉంటున్న ముత్యాలప్ప అంజీనమ్మ ఏడాది క్రితం కర్ణాటక రాజధాని బెంగళూర్ నుంచి రెండు కుక్క పిల్లలను తెచ్చింది.

ఆమె కుమారుడు సాయి (16) వాటిని అత్యంత ప్రేమతో సాకుతూ వచ్చాడు. రెండింటిలో ఓ కుక్క పిల్ల గురువారం రాత్రి మరణించింది. దాన్ని జీర్ణించుకోలేక సాయి శుక్రవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఇటీవలే పదో తరగతి పాసయ్యాడు.

ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లా యాలాల మండలం దేవనూరులో దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. చెన్నప్ప, లక్ష్మిల మూడేళ్ల కూతురు ప్రత్యూష గొంతులో వేరుశనక్కాయ ఇరుక్కుని మరణించింది.

ఇంట్లో వేరుశనక్కాయలు వొలుస్తుండగా ప్రత్యూష ఓ శనక్కాయను మింగింది. ఆడుకుంటూ దాన్ని నోట్లో వేసుకుంది. అది గొంతులో చిక్కుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు విడిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+