తెలంగాణ చల్లబడింది: లగడపాటి, జగన్ అర్హతపై ఉత్తమ్

Lagadapati Rajagopal
హైదరాబాద్/విజయవాడ: రాష్ట్రంలో భావోద్వేగాలు సమసిపోయాయని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శనివారం అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి చెందని అన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఏ పార్టీ వచ్చిన స్వాగతిస్తామని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఎన్నికల్లోను కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు.

జగన్‌కు ఏ అర్హత ఉంది?: ఉత్తమ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తనలో ఏం చూసుకుని ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి కావలసిన అర్హతలు ఏమీ ఆయనకు లేవని ఆయన వ్యాఖ్యానించారు.

ఏ అర్హత ఉందని జగన్ సిఎం పదవి కోరుతున్నారని ఘాటుగా ప్రశ్నించారు. జగన్ తన సొంత మీడియాను ఉపయోగించుకుని ప్రభుత్వ పథకాలపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారే ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+