ఉత్తరాఖండ్ ఫ్లడ్స్: ఎపి భవన్లో ఎన్టీఆర్ ట్రస్ట్‌కి నో పర్మిషన్

No Permission to NTR Trust
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లో ఉత్తరాఖండ్ బాధితులకు వైద్య సహాయం అందించేందుకు వెళ్లిన ఎన్టీఆర్ ట్రస్ట్ బృందానికి సోమవారం చుక్కెదురయింది. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య బృందం వైద్య సహాయానికి అధికారులు నిరాకరించారు. ప్రభుత్వ సహాయం అందుతోందని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య బృందం ఎపి భవన్ బయటనే బాధితులకు చికిత్స అందిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య బృందం సాయం చేయడానికి ముందుకు వస్తే నిరాకరించడం శోచనీయమని రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి అన్నారు.

ఢిల్లీలో తెలుగువారికి జరుగుతున్న అవమానం చూస్తుంటే రక్తం మరుగుతోందని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. యాత్రికులు కటిక నేల పైన పడుకుంటున్నారని మండిపడ్డారు. ఎపి భవన్ 25 ఎకరాలలో ఉంటే కాంగ్రెసు నేతలు అందులో గంజాయి పండించడానికే సరిపోతుందన్నారు. తెలుగు యాత్రికులకు సరైన వసతులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీ ఎపి భవన్‌కు చేరుకున్న ఉత్తరాఖండ్ బాధితులను రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సోమవారం పరామర్శించారు. ఉత్తరాఖండ్ సహాయక చర్యలపై విహెచ్ పెదవి విరిచారు. విఐపి బాధితుల్ని మాత్రమే హెలికాప్టర్లలో తరలిస్తున్నారని, అధికారుల తీరు సరిగా లేదన్నారు.

ఉత్తరాఖండ్ వరదల్లో వేలాది మంది రాష్ట్రానికి చెందిన భక్తులు చిక్కుకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇక్కడ ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉన్నారని వర్ల రామయ్య విమర్శించారు. బాధితుల విషయంలో సర్కారు సరైన రీతిలో స్పందించలేదన్నారు.

ప్రభుత్వం స్పందించింది: బొత్స

ఉత్తరాఖండ్ బాధితుల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా స్పందించాయని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. బాధితులకు పిసిసి తరఫున సాయం అందిస్తామన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వెంటనే స్పందించి, ఏరియల్ సర్వే చేశారన్నారు. రేపు తాను ఢిల్లీకి వెళ్లి బాధితుల్ని పరామర్శిస్తానని చెప్పారు. నిన్నటి వరకు విదేశాల్లో ఉన్న చంద్రబాబు ఇప్పుడు వచ్చి రాజకీయ లబ్ధి కోసం రాద్దాంతం చేయడం తగదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+