చంచల్‌గుడా జైల్లోనే సాయిరెడ్డి: సిబిఐ మెమో కొట్టివేత

జగన్, విజయసాయిరెడ్డిని వేర్వేరు జైలుల్లో ఉంచాలని కోరుతూ సిబిఐ మెమో దాఖలు చేసింది. ఈ మెమోపై విచారణ జరిపిన కోర్టు దాన్ని కొట్టేసింది. బెయిల్ గడువు దాటిన తర్వాత విజయసాయిరెడ్డి లొంగిపోయారు. అప్పుడు ఆయనను చంచల్‌గుడా జైలుకు తరలించారు.
అక్బరుద్దీన్‌పై పిటిషన్
ఇదిలావుంటే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనార్దన్ గౌడ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సిఇసి, ఈసి, అక్బరుద్దీన్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
బయ్యారం పిటిషన్‌పై విచారణ
ఖమ్మం జిల్లా బయ్యారం గనులను విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి కేటాయించడంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications