అంతా ఊహాజనితమే, దిగ్విజయ్ రిపోర్ట్ అవసరం: గంటా

తెలంగాణకు పరిష్కారం చూపుతుంది: రఘువీరా
కుటుంబ పెద్దగా అధిష్టానం తెలంగాణ సమస్యకుపరిష్కారం చూపుతుందని తాను ఆశిస్తున్నానని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. తెలంగాణ అంశంపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. రాయల తెలంగాణ, ప్యాకేజీ వార్తల నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. తెలంగాణపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ఆకాంక్ష చాటుతాం: పొన్నాల
ఈ నెల 30వ తేదిన హైదరాబాదులో నిర్వహించే బహిరంగ సభ ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను తాము చాటుతామని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాదులో అన్నారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప తాము మరో ప్రత్యామ్నాయానికి అంగీకరించే ప్రసక్తి లేదన్నారు.
హైదరాబాదుతో కూడిన తెలంగాణ: ఎర్రబెల్లి
హైదరాబాదుతో కూడిన తెలంగాణ మాత్రమే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు డిమాండ్ చేశారు. హైదరాబాదులో కాంగ్రెసు నేతలు తలపెట్టిన సభను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్యాకేజీలు, రాయల తెలంగాణను ఒప్పుకునేది లేదన్నారు.












Click it and Unblock the Notifications