వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు అనుభవం: భార్యకు సంజయ్ దత్ రోజుకో లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sanjay writes a letter to wife everyday
పుణే: 1993 అల్లర్ల కేసులో అరెస్టై పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన సతీమణి మాన్యతా దత్‌కు రోజుకో లేఖ రాస్తున్నారట. తన జైలు అనుభవాలను ఆ లేఖలో సంజయ్ పేర్కొంటున్నారట. మాన్యతా దత్ కూడా సంజయ్‌కి రోజుకో లేఖ రాస్తున్నారట.

సంజయ్ దత్ నివాసం అయిన నర్గీస్ దత్ రోడ్డు, పాలి హిల్స్‌లోని ఇంపీరియల్ హైట్స్‌లో ఉన్న 11వ ఫ్లోర్‌లోని మాన్యత ఇంటి తలుపును పోస్టుమన్ రోజు తడుతున్నాడట. సంజయ్ దత్ జైలుకు వెళ్లాక అతను రోజుకో లేఖను తీసుకు వచ్చి మాన్యతా దత్‌కు ఇస్తున్నాడట.

సంజయ్ దత్ గత నెల 16వ తేది నుండి జైలు జీవితం గడుపుతున్నాడు. ఇతను ప్రస్తుతం పుణేలోని ఎరవాడ జైలులో ఉన్నాడు. జైలులో ఉన్న సంజయ్ తన జైలు అనుభవాలను పొందుపర్చి మాన్యతకు రోజుకో లేఖను పంపిస్తున్నాడు. దానికి మాన్యత కూడా మరుసటి రోజు సమాధానం ఇస్తూ మరో లేఖను రాస్తున్నారట.

కాగా, 1993 అల్లర్ల కేసులో అరెస్టై పుణేలోని ఎరవాడ జైలులో ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు అధికారులు 16656 నంబరు కేటాయించిన విషయం తెలిసిందే. ఆయన ఎరవాడ జైలుకు రావడం ఇది మూడోసారి. ఆయనను మూడో నంబరు గదిలో ఉంచారు. ఆయన బ్యారక్ చుట్టూ చాలా చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని జైలు అధికారులు చెప్పారు.

English summary
Since Sanjay's incarceration on May 16, he is currently lodged at the Yerawada prison in Pune. The actor has been writing a letter a day to his wife. And, Maanayata has been replying to her husband every single day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X