విలీనమయ్యాం, మా అభిప్రాయముండదు: చిరు మంత్రి

హైదరాబాదుతో కూడిన తెలంగాణ: వివేక్
హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప మరేమీ తాము అంగీకరించేది లేదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ వేరుగా అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అన్నారు. తెరాసలోకి వలసలను ఆపేందుకే కాంగ్రెసు పార్టీ చర్చల పేరుతో జిమ్మిక్కులు చేస్తోందన్నారు.
ఢిల్లీలో వాడివేడిగా చర్చలు
కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వారు చర్చించారు. అనంతరం బొత్స, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిలతో ముఖ్యమంత్రి ఎపి భవన్‌లో భేటీ అయ్యారు.
అంతకు ముందు కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావుతో కిరణ్ భేటీ అయ్యారు. మరోవైపు ఉత్తరాఖండ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కిరణ్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోసం వేచిచూస్తున్నారు.












Click it and Unblock the Notifications