చిరంజీవి నియోజకవర్గం!: గల్లా జయదవ్ ఆశలు

చిరు రాజీనామా చేయడంతో అక్కడి నుండి ఉప ఎన్నికలలో పోటీ చేయాలని గల్లా జయదేవ్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ వైపు మొగ్గు చూపారు. తన జయదేవ్ కోసం గల్లా అరుణ కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పలు సమీకరణాల దృష్ట్యా, చిరు, కిరణ్‌లు మొగ్గు చూపిన నేపథ్యంలో అధిష్టానం వెంకటరమణకే పోటీ చేసేందుకు అవకాశమిచ్చారు. దీంతో జయదేవ్ ఆశలు నీరుగారిపోయాయి.
అయితే ఇప్పుడు 2014లో మళ్లీ తిరుపతి నుండి పోటీ చేసేందుకు తనకు అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయంతో గల్లా జయదేవ్, ఆయన అనుచరులు ఉన్నారట. ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా వచ్చిన దిగ్విజయ్ సింగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. అంతేకాకుండా ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీతో ఉన్న సంబంధాలు కూడా తనకు 2014లో టిక్కెట్ వచ్చేందుకు సహకరిస్తుందని ఆయన వర్గం ధీమాగా ఉందట.
గత ఉప ఎన్నికలలో జయదేవ్‌ను తిరుపతి నుండి పోటీ చేయించేందుకు గల్లా అరుణ కుమారి చేయని ప్రయత్నం లేదంటారు. ఆమె అప్పుడు చిరంజీవిని కూడా కలిశారు. జయదేవ్ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. తాను పోటీ చేస్తే ఎలా గెలుస్తానో లెక్కలేసి మరీ చెప్పారట అధిష్టానానికి. అయితే ఇప్పుడు దిగ్విజయ్ రాక, రాహుల్‌తో పరిచయం తదితర పరిణామాలు తనకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications