సర్పంచ్‌లా రోడ్డెక్కాలా: తెలంగాణపై కావూరి యూ టర్న్

ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. గతంలో తెలంగాణ ఇస్తానంటే ఆయన తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఆయన తెలంగాణపై ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానన్నారు. కొన్ని విషయాలలో రాజీపడక తప్పదని చెప్పారు. తెలంగాణపై తేల్చాల్సింది అధిష్టానమే అన్నారు.
తాను కేంద్రమంత్రిని అయ్యాక కూడా గ్రామ సర్పంచ్ స్థాయిలో ఆలోచించలేనని అన్నారు. సర్పంచ్‌లా ఉద్యమంలో పాల్గొనాలా అని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలమైనా, వ్యతిరేకమైనా తాను కట్టుబడి ఉంటానన్నారు. రాజీపడక తప్పదన్నారు. తాను రాజీనామా చేస్తానంటే కేంద్రమంత్రి పదవి ఇచ్చారనడం సరికాదన్నారు. తన అర్హతనలను అన్నింటిని పరిశీలించాకే అధిష్టానం పదవిని ఇచ్చిందన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సి ఉందన్నారు.
సమైక్యాంధ్ర జెఏసి సమావేశం
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందన్న నేపథ్యంలో సమైక్యాంధ్ర జెఏసి ఈ రోజు సమావేశం కానుంది. రేపటి నుండి అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపట్టనుంది. జూలై 3న ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. జూలై తొలి వారంలో ఎయులో భారీ బహిరంగ సభ, 15న రథయాత్ర చేయనున్నారు. మరోవైపు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications