సాక్షి డైలీవి అబద్ధాలు: సోమిరెడ్డి, విజయమ్మపై ఫైర్

నెల్లూరు జిల్లాలో తక్కువ ధరకే వేల ఎకరాల భూమిని కట్టబెట్టారని చెప్పారు. సాక్షిలో ప్రచురించిన 223, 300 జీవోల్లో కృష్ణపట్నం పోర్టుకు భూకేటాయింపుల ప్రస్తావనే లేదని ఆయన అన్నారు. మీనాక్షి ఎనర్జీ, సింహపురి ఎనర్జీ, నవయుగ, కెనెటాకు భూములు కేటాయించినట్లు జీవోల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. కృష్ణపట్నం పోర్టుకు భూ కేటాయింపుపై జీవోలు లేకున్నా ఉన్నట్లు సాక్షి దినపత్రికలో ప్రచురించారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
తమ పార్టీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజకీయ పరిజ్ఝానం లేకుండా విజయమ్మ మాట్లాడుతున్నారని, రాజకీయ పరిజ్ఝానం లేని ఆమె తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. యుపిఎకు మద్దతు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
అవినీతి సొమ్ముతో తెలుగుదేశం పార్టీ పుట్టలేదని ఆయన అన్నారు. తమ పార్టీని విమర్శించే నైతిక అర్హత విజయమ్మకు లేదని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications