పెళ్లికి నో అన్నదని యువతి నకిలీ ఫేస్‌బుక్, అశ్లీల ఫోటో

అదే శిక్షణ కేంద్రంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని శిక్షణ పొందుతోంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని అతను ఆమెను అడిగాడు. దానికి ఆమె అంగీకరించలేదు. దీంతో కక్ష పెంచుకున్న గిరీష్.. ఆమె ఫోటోలతో నకిలీ ఫేస్ బుక్ ఖాతను తెరిచాడు.
అందులో అభ్యంతరకర, అశ్లీల ఫోటోలను పెట్టడం ప్రారంభించాడు. ఆమెకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో ఆమె తండ్రి సిఐడి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతనిని విచారిస్తున్నారు.
ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు
తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లరేవు మండలం నీలాద్రిరావుపేటలో దారుణం జరిగింది. ప్రియురాలిపై ఓ ప్రియుడు కత్తి దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. గొంతు కోయడంతో ప్రియురాలి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications